Pawan Kalyan's debts are more than his assets! Johnny Flop returned 1.5 crores : పవన్ కళ్యాణ్ ఆస్తుల కంటే అప్పులే చాల ఎక్కువ! జానీ ఫ్లాప్ 1.5 కోట్లు తిరిగి ఇచ్చాడు

టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ కు అత్యధిక రెమ్యూనరేషన్ అందుతుందనడంలో  ఏ సందేహం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ చాలా అప్పుల్లో ఉన్నాడని మనం వింటూనే ఉంటాం.


పవన్ కళ్యాణ్ ఇటీవలి రైతు భరోసా యాత్రలో చాలా మంది రైతులకు తన ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. పవన్ చాలా మందికి వివిధ సందర్భాల్లో సహాయం చేసారు. పవన్ కళ్యాణ్ తన ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉందని, ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు తెలిపారు.


పవన్‌తో సన్నిహితంగా ఉండే కొంత మంది ఆయనకు నిధుల కొరత ఉందని చెబుతుంటారు. ‘‘నా తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ. ఇ విషయాన్ని ఎవరికైనా చెబితే నమ్మరు. పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్నా, క్లియర్ చేయడానికి చాలా అప్పులు ఉన్నాయి’’ అని నాగబాబు అన్నారు.


పవన్ కళ్యాణ్ తన సంపాదన మొత్తం ప్రజా సంక్షేమం, పార్టీ కోసమే ఖర్చు చేస్తున్నాడని నాగబాబు తెలిపారు. పార్టీ స్థాపన కోసం పిల్లల పేరుతో తన ఫిక్స్‌డ్ డిపాజిట్లనుకూడా పవన్  బ్రేక్ చేశారని నాగబాబు తెలిపారు.  ఇక అతని పేరు మీద విలువైన వస్తువులు ఏమి లేవు. ఆయనకు కేవలం ఒక 8 ఎకరాల భూమి ఉన్న ఫామ్‌హౌస్ ఉంది’’ అని నాగబాబు అన్నారు. 

Pawan Kalyan Launches New Film: Original Gangster

 అప్పట్లో జానీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పుడు పవన్ తన 1.5 కోట్ల రూపాయల పారితోషికాన్ని ప్రొడ్యూసర్స్కి తిరిగి ఇచ్చాడు. తాను ఉంటున్న కారు, ఇల్లు కూడా అప్పుగా తీసుకున్నవే’’ రాజకీయాల్లో తప్పుడు సంపాదనతో ఆస్తులు కూడబెటుకోవాలనే ఉద్దేశం పవన్‌కు ఏమి లేదని నాగ బాబు అన్నారు.

NBK2: Pawan Kalyan Nandamuri Balakrishna is a mega feast for fans

Post a Comment

0 Comments