NASA • James Webb Space Telescope Reaches Major Milestone : విశ్వo ఆవిర్భావం రహస్యాలను చేధించేలా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ మరో సంచలనం!

 విశ్వo ఆవిర్భావం రహస్యాలను చేధించేలా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ మరో సంచలనం!

Credits: NASA GSFC/CIL/Adriana Manrique Gutierrez

నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ శనివారంతో తన రెండు వారాల విస్తరణ దశను పూర్తి చేసుకుంది. కాస్మిక్ చరిత్రలోని ప్రతి అంశాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చివరి మిర్రర్ ప్యానెల్‌ను ఓపెన్‌చేసుకుంది. నాసా లాస్ట్‌ వింగ్‌ డిప్లాయ్‌ పూర్తి చేసింది అంటూ ట్వీట్‌ చేసింది.ఈ ప్రయోగం సత్ఫలితాల్ని అందించడంతో నాసా కేంద్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమఅయ్యాయి.ముఖ్యంగా కాన్ఫిగరేషన్‌ సమయంలో తలెత్తిన సమస్యను నాసా సైంటిస్ట్‌లు గండం నుంచి గట్టెక్కించడంపై ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


డిసెంబర్‌ 25 శనివారం నాసా ప్రపంచంలోనే భారీ, ఇంకా శక్తివంతమైన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్‌–5 రాకెట్‌లో దీన్ని నింగిలోకి పంపించారు. విశ్వo  ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను చేధించేలా  భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకోనుంది. 


ఇక ఈ మొత్తం దూరం ప్రాయనించేందుకు దాదాపు నెల రోజుల సమయం పడుతుంది, నాసా ఈ ప్రయోగం కీలక దశ విజయవంతమైందని ట్వీట్‌ చేసింది.


Post a Comment

0 Comments