Gruhalakshmi serial actress Tulsi Fire on Siddharth : సిద్దార్థ్‌పై గృహలక్ష్మీ సీరియల్ నటి తులసి ఫైర్ : చేసిన తప్పుకు బాధపడు

హీరోపై కస్తూరీ శంకర్ ఆగ్రహం ఇలాంటి పిచ్చి కామెంట్లు చేయడం ఏంటి సిద్దార్థ్.. 



పంజాబ్‌లో ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన ఒక అంశం మీద సైనా నెహ్వాల్ స్పందిస్తూ..మన ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేసారు. ఐతే సైనా చేసిన ట్వీట్ మీద హీరో సిద్దార్థ్ వ్యంగ్యంగా స్పందించాడు.


సిద్దార్థ్ వేసిన ట్వీట్‌తో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా మహిళా కమీషన్ కూడా రంగంలోకి వచ్చింది. సిద్దార్థ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు చర్యలకు సిద్దపడింది. మరోవైపు సింగర్ చిన్మయి కూడా సిద్దార్థ్ వ్యాఖ్యల పట్ల చాల అసంతృప్తిని వ్యక్తం చేసింది.


సైనా కూడా సిద్దార్థ్ వ్యాఖ్యల పట్ల చాల అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఏం అన్నారో.. ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు తెలీదు. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు అంటూ సైనా స్పందించారు. 


ఇక తాజాగా గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరీ శంకర్ అయితే ఏకంగా సిద్దార్థ్ మీద చిందులు తొక్కారు.సైనా నెహ్వాల్ మీద సిద్దార్థ్ చేసిన కామెంట్లు చూసి నేను  షాక్ అయ్యాను. అతడి నుంచి నేను ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది వరకు అతడికి రాజకీయ పరంగా వ్యక్త పరిచిన భావాల వల్ల ఎదురుదాడి వస్తే నేను అతనికి అండగా నిలిచాను. కానీ సిద్దార్థ్ ఇపుడుఇలా పర్సనల్ అటాక్ చేయడం బాగా లేదు. 


Follow us on


ఓ జాతీయ హీరో తన స్థాయిని తానే తగ్గించుకున్నాడు.. ఇలా మాట్లాడటం వెనుక ఆయన్ను ఎవరో ప్రేరేపిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. బ్యాడ్మింటన్, కాక్ అండ్ బుల్ స్టోరీ అని చెప్పి తప్పించుకోకు చేసిన తప్పుకు బాధపడు అని ట్వీట్ చేసారు..


మరో ట్వీట్ చేసిన కస్తూరీ శంకర్.. సిద్దార్థ్ ఇంకా నువ్ ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేయలేదు.. సారీ ఎందుకు చెప్పలేదు. నీ అడ్మిన్ మీద నువ్వు ఎందుకు ఫైర్ అవ్వలేదు.. ఇలాంటి పిచ్చి కామెంట్లు చేయడం ఏంటి సిద్దార్థ్.. అని ట్వీట్ చేసారు.

Post a Comment

0 Comments